నేడు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం
- పదేళ్ల తర్వాత కేరళలో అధికారంలోకి యూడీఎఫ్ కూటమి
- ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న రాహుల్, ప్రియాంక గాంధీ
- ముఖ్యమంత్రితో కలిపి 21 మందితో కేబినెట్ కూర్పు
- ప్రమాణ స్వీకారానికి ముందు కార్డినల్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్న సతీశన్
కేరళ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఘన విజయం సాధించడంతో పదేళ్ల విరామం తర్వాత తిరిగి అధికారంలోకి వస్తోంది.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా, కేరళ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందు, ఆదివారం సతీశన్ ప్రముఖ కార్డినల్ మోరన్ మోర్ బసిలియోస్ క్లెమిస్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కార్డినల్ క్లెమిస్ బావా అందించిన దీవెనలు, శుభాకాంక్షలు తనకు ఎంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయని సతీశన్ ఎక్స్ వేదికగా తెలిపారు. అన్ని వర్గాలను గౌరవిస్తూ, కేరళ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రితో కలిపి కొత్త మంత్రివర్గంలో 21 మంది సభ్యులు ఉండనున్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి పదవి సహా కాంగ్రెస్‌కు 11 మంత్రి పదవులు దక్కనున్నాయి. మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కు ఐదు మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. ఐయూఎంఎల్ నుంచి పీకే కున్హాలికుట్టి, కేఎం షాజీ, ఎన్. షంసుద్దీన్, పరక్కల్ అబ్దుల్లా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, పీకే బషీర్‌కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.